North Korea Puts Capital In 5-Day Lockdown: ఉత్తర కోరియాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిమ్ సర్కార్ మాత్రం దీన్ని కరోనా అని పిలవకుండా ‘‘శ్వాసకోశ అనారోగ్యం’’ అనే పేర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో 5 రోజుల పాటు లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాజధానికే పరిమితం అయిందా..? లేక పోతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విధించిందా..? అనేది స్పష్టంగా తెలియడం లేదు.
transgender story in uttar pradesh: ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించకోవడం, అబ్బాయిలు ప్రేమించుకోవడం చూస్తున్నాం. స్వలింగ సంపర్కులు మారి పెళ్లి చేసుకున్నారనే వార్తలు వింటున్నాం. అయితే తాజాగా యూపీలో జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో ఒకరు అబ్బాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకన్నారు. చివరకు అబ్బాయిగా మారిన అమ్మాయి తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెక్కింది.
DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా..మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతోంది.
Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
BBC documentary on modi: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది.
Ex US Secretary Of State On India-Pak Nuke Threat After Balakot: బాలాకోట్ దాడుల అనంతర పాకిస్తాన్, భారత్ పై అణుదాడికి సిద్ధం అయిందని వెల్లడించారు అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఈ విషయాన్ని అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా నాలో చెప్పారని.. ఆ సమయంలో నేను వియత్నాంలోని హనోయ్ లో ఉన్నానని.. అణుదాడికి ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం అవుతుందనే మాటతోనే నేను నిద్ర లేచానని వెల్లడించారు.
Maruti Suzuki Grand Vitara recalled: మారుతి సుజుకీ గతేడాది గ్రాండ్ విటారాను ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. హైబ్రీడ్ కారుగా గ్రాండ్ విటారాను తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ఈ కార్లలో కొన్ని లోపాలు ఉండటంతో ఏకంగా 11,177 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వెనక సీట్ బెల్ట్ మౌంట్ బ్రాకెట్లలో లోపం ఉందని గుర్తించింది. దేశంలో అతిపెద్ద కార్ మేకర్ అయిన మారుతి సుజుకీ గ్రాండ్ విటారా విషయంలో రెండు నెలల్లో మూడోసారి రీకాల్ చేసింది.
India Under Scrutiny As WHO Looks At Cough Syrup Deaths: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. సంబంధిత దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశంలో తయారైన దగ్గుమందుల వల్ల మూడు దేశాల్లో 300 మందికి పైగా పిల్లలు మరణించారు. గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా దేశాల్లో పిల్లల మరణాలు నమోదు అయ్యాయి. భారతదేశం, ఇండోనేషియాలో తయారైన ఆరు ఔషధ కంపెనీలో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ కంపెనీలకు…
Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి.
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో రామచరితమానస్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. ఇటీవల ఇటీవల బీహార్లో ఆర్జేడీ నేత రామచరిత్ మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య కూడా రామచరిత మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. మౌర్య నాలుకను చీరేస్తే రూ.51000 రివార్డు ప్రకటించింది.