Physically Abuse: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. విధుల్లో ఉన్న సమయంలో 22 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలతో ఆర్మీ జవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం నాడు సాయంత్రం సమయంలో టాటీసిల్వాయి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. రాంచీకి వెళ్లేందుకు రైలు కోసం వేచి చూస్తున్న యువతిని సైనికుడు రైలులోని ఖాళీ కోచ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: జార్జ్ సోరోస్ వ్యక్తితో రాహుల్ గాంధీ.. “రెండు శరీరాలు, ఒకే ఆత్మ” అంటూ బీజేపీ ఫైర్..
అయితే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు డిఫెన్స్ లాజిస్టిక్స్ రైలుకు భద్రతా విధుల్లో ఉండగా ఈ నేరానికి పాల్పడ్డాడు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా సరహా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఈ జవాన్, పంజాబ్‌లోని పాటియాలాలో 42 మీడియం రెజిమెంట్‌లో పని చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?
ఇక, బాధిత మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు అతడ్ని పట్టుకుని దేహశుద్దీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు అనంతరం నిందితుడిని శుక్రవారం నాడు కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడిని రిమాండ్ కు పంపించింది.