India Under Scrutiny As WHO Looks At Cough Syrup Deaths: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. సంబంధిత దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశంలో తయారైన దగ్గుమందుల వల్ల మూడు దేశాల్లో 300 మందికి పైగా పిల్లలు మరణించారు. గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా దేశాల్లో పిల్లల మరణాలు నమోదు అయ్యాయి. భారతదేశం, ఇండోనేషియాలో తయారైన ఆరు ఔషధ కంపెనీలో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ కంపెనీలకు…
Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి.
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో రామచరితమానస్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. ఇటీవల ఇటీవల బీహార్లో ఆర్జేడీ నేత రామచరిత్ మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య కూడా రామచరిత మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. మౌర్య నాలుకను చీరేస్తే రూ.51000 రివార్డు ప్రకటించింది.
IT layoffs put US work visas of Indians at stake: సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే భారతీయులకు ఓ కల. ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే లక్షల్లో జీతాలు, ఇక అమెరికాలో ఉద్యోగం అయితే డాలర్లలో సంపాదన. చివరకు తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయిలను ఐటీ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునేంతగా ఈ ఉద్యోగం భారతీయ సమాజంపై ప్రభావం చూపింది. చాలా మందికి అమెరికా అనేది డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ కలలు చెదిరిపోతున్నాయి. ఐటీ అంటేనే భయపడాల్సి వస్తోంది. జాబ్ ఎప్పుడు…
California shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కాల్పుల ఘటనలో 11 మంది మరణించి 48 గంటలు లోపే మరో సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ++
Fight In Flight: విమానాల్లో ప్రయాణికుల వికృత చర్యలకు అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల మూత్రవిసర్జన సంఘటన తర్వాత డీజీసీఏ ప్రయాణికుల ప్రవర్తనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. ప్రయాణికుడిపై సెక్షన్ 354ఏ కింద కేసు కూడా నమోదు చేసినట్లు ఢిల్లీ…
US Reply To Query On BBC Documentary Critical Of PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చరచ్చ అవుతోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీ మీడియా రిపోర్టుపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. యూకే ఎంపీలు కూడా ఈ డాక్యుమెంటరీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. పాకిస్తాన్ మూలలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందంటూ దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీకి ఈ విజయం దక్కడంపై ఆ పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న 19 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 11 మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం సాధించగా.. 8 పట్టణాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీజేపీ అభ్యర్థులు 183 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోగా.. 143 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్సీయూ వార్తల్లో నిలిచింది.
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చకు దారి తీసింది. యూకే-ఇండియా సంబంధాలపై ప్రభావం పడేలా ఉండటం ఉంది. మరోవైపు యూకే, ఇండియాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉండగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేయడంపై అక్కడి ఎంపీలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేసింది. వలసవాద మనస్తత్వానికి నిదర్శనం ఈ డాక్యుమెంటరీ అంటూ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.