Andhra King Thaluka OTT Release: రామ్ పోతినేని రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించిన విషయం తెలిసిందే. ‘బయోపిక్ ఆఫ్ ఫ్యాన్’ అంటూ ప్రమోట్ చేసిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటించిన సంగతి విదితమే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రడీ అవుతుంది.
READ ALSO: Rahul Gandhi: జార్జ్ సోరోస్ వ్యక్తితో రాహుల్ గాంధీ.. “రెండు శరీరాలు, ఒకే ఆత్మ” అంటూ బీజేపీ ఫైర్..
ఈ చిత్రం డిసెంబర్ 25 నుంచి నెటిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ నెటిక్స్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెటిక్స్‌లో అందుబాటులో ఉండనున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా కథ ఏమిటంటే.. ‘ఆంధ్ర కింగ్’ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య (ఉపేంద్ర) 100వ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది. ఎలా అయినా ఆ సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఫలించవు. అయితే ఒక అభిమాని సాగర్ (రామ్ పోతినేని) తన అకౌంట్లో మూడు కోట్లు వేశాడనే విషయం తెలుసుకుని, అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్తాడు సూర్య. ఈ నేపథ్యంలోనే అసలు సాగర్ ఎవరు? తనకు మూడు కోట్లు వేసేంత డబ్బు అతని దగ్గర ఉందా? సాగర్కు, అతని ప్రేయసి మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ప్రేమకు ఉన్న అడ్డంకులు ఏమిటి? చివరికి తన అభిమానిని సూర్య కలుసుకున్నాడా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
READ ALSO: Team India Missing Players: టీ 20 ప్రపంచ కప్ జట్టులో రిపీట్ కానీ స్టార్ ప్లేయర్స్ వీళ్లే..