KTR: రెండేళ్లు బీఆర్ఎస్కు పరీక్ష కాలం.. వాళ్లు ఏమ్మన్న తలదించుకుని వెళ్లండి..
- పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం మాట మార్చింది..
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ కాలు బయట పెట్టలేదు..
- తెలంగాణలో అద్భుతంగా బీఆర్ఎస్ నేతలు సర్పంచులుగా గెలిచారు..
- రెండేళ్లు బీఆర్ఎస్కు పరీక్ష కాలం.. వాళ్లు ఏమ్మన్న తలదించుకుని వెళ్లండి: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్ లో తాండూరు నియోజకవర్గం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు.. రెండేళ్లు మనకు కష్టాలు తప్పవు అని సెటైర్లు వేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఐదు నిమిషాలకే మాట మార్చారు అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ కాలు బయట పెట్టకపోయినా గులాబీ సైనికులు అద్భుతంగా పోరాడారు, ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ అన్నారు.
Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?
Also Read
అయితే, కారు గుర్తు ఉండి, కేసీఆర్ గుర్తుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని కేటీఆర్ తెలిపారు. రెండేళ్లు బీఆర్ఎస్ కు పరీక్ష కాలం.. కాంగ్రెస్ వాళ్లు ఏమైనా అంటే తలదించుకుని వెళ్లండి, రెండు అడుగులు వెనక్కు వెళ్లండి అని సూచించారు. పంచాయతీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయి, ఎవరి ప్రమేయం ఉండదన్నారు. బీఆర్ఎస్ సర్పంచులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు.. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇలా అన్నింటి జాబితా పంచాయతీల్లో పెట్టాల్సిందే.. సర్పంచులు, పంచాయతీల చేతిలోనే ఉంటుంది.. నిధులు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు.. కాంగ్రెస్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు, అందరూ బాధపడుతున్నారు.. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అంటున్నారు.. ఇప్పటి నుంచే సిద్ధం కావాలి.. గ్రామీణ ప్రాంతాల వారికి మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించండి అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!