Teacher Arrested For Blasts In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒకదానితో సహా పలు పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ గురువారం తెలిపారు. రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్ అనే…
Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అలసత్వం, భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
pakistan economic crisis: గడ్డి తినైనా మేం అణుబాంబును తయారు చేస్తాం అని 1970ల్లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయి. కానీ తినడానికి తిండి దొరికే పరిస్థితి లేదు. నిజంగా పాకిస్తాన్ ప్రజలు గడ్డి తిని బతికే పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోబోతోంది. విదేశీమారక నిల్వలు తరిగిపోయాయి. దీంతో ఇక పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని అప్పుల కోసం అడుగుతోంది. అయితే భారత్ ను మాత్రం సాయం అడిగేందుకు ఈగో…
India-Pakistan: గోవాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను భారత్ ఆహ్వానించనుంది. అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా భారత్ ఆహ్వానం పలికింది. వీరిద్దరిలో ఎవరు హాజరైనా.. 2011 తర్వాత భారత్ ను సందర్శించిన పాక్ ప్రతినిధులుగా చరిత్రకెక్కుతారు. వీరితో పాటు చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ కు కూడా భారత్ ఆహ్వానం పలికింది. అయితే వీరిద్దరు సమావేశానికి హాజరావుతారా..? లేదా..? అనేది ధృవీకరించలేదు. పాక్ తరుపున 2011లో…
TISS students to screen BBC documentary on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయింది. భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. భారత ప్రభుత్వం దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీ ఇటు ఇండియాతో పాటు యూకేలో కూడా చర్చనీయాంశం అయింది. అయితే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యూ) ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం…
Physical assault on teenage girl in Nagpur: దేశంలో ఎన్ని చట్టాల వచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దిశ, నిర్భయం, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వావీవరస, చిన్నా పెద్దా అనే బేధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు దేశంలో ఎక్కడో చోట వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తా
74th Republic Day: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరపుకుంటున్న సందర్భంగా ఈ గణతంత్ర వేడుకలు ప్రతేకమైనది. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. తోటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। इस […]
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇటు భారత్, అటు యూకేలు స్పందించాయి. వలసవాద మనస్తత్వంగా ఈ డాక్యుమెంటరీని అభివర్ణించింది భారత ప్రభుత్వం. మరోవైపు ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇక యూకేలో దీనిపై ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు డాక్యుమెంటరీని సమర్థించగా.. మరికొందరు ప్రధాని మోదీకి మద్దతు పలికారు.
IBM Cuts 3,900 Jobs In Latest Tech Layoffs: ఐటీ ఉద్యోగులను కంపెనీలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అని కంగారు పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. తాజాగా 3,900 ఉద్యోగాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్‌లలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ బుధవారం వెల్లడించింది. అయితే క్లయింట్-ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్…
Facebook, Instagram, WhatsApp Down For Thousands Of Users In US: అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్లకు కూడా అంతరాయం…