India Summons Canada Envoy Over Khalistan Protest: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో అశాంతి చెలరేగేలా చేసేందుకు ప్రయత్నించిన ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ తన వేషాన్ని మార్చుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Swara Bhasker: అనర్హత వేటు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ మద్దతుగా నిలిచారు. పప్పు అని విమర్శిస్తున్నవారు ఆయనకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడంపై ట్వీట్ చేస్తూ.. చట్టాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించారు. ఆయనను డిస్ క్వాలిఫై చేయడానికి చట్టాలను దుర్వినియోగం చేశారని అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’’లోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే తాజాగా ఆయన తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. "డిస్ క్వాలిఫై ఎంపీ" అంటూ ప్రొఫైల్ లో మార్పులు చేశారు.
Security for The Tree: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ చెట్టును కంటికి రెప్పలా కాపాడుతోంది. దీనికి చుట్టూ కంచె, రక్షణగా సాయుధులైన నలుగురు గార్డులు 24 గంటలకు చెట్టుకు చూసుకుంటున్నారు. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏకంగా లక్షల్లో వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు నీరు పోసేందుకు రూ.64 లక్షలు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ రైసెన్ లోని సాంచి స్థూపం సమీపంలో ఈ చెట్టును నాటారు. దీనికి పగలు, రాత్రి సెక్యూరిటీ ఇస్తున్నారు.
Parole for Marriage: పెళ్లి కోసం ఏ నేరస్తుడికి 4 గంటల పర్మిషన్ ఇచ్చారు జైలు అధికారులు. మళ్లీ వివాహం తతంగం పూర్తయిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈ ఘటన బీహార్ గోపాల్గంజ్ జిల్లాలో జరిగింది. అత్యాచార ఆరోపణలపై 20 రోజుల క్రితం జైలుకు వెళ్లిన యువకుడు, అత్యాచారానికి గురైన బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కోసం జైలు అధికారులు 4 గంటల పర్మిషన్ ఇచ్చారు.
Indian journalist attacked Khalistani supporters: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత తొమ్మిదిరోజులుగా అతను తన రూపాన్ని మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంత జరిగిన పంజాబ్ ప్రశాంతంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న రాడికల్ ఎలిమెంట్స్, ఖలిస్తానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ వారం యూకే లండన్ లోని భారత హైకమిషన్ పై దాడి చేశారు.
Earthquake: ఇటీవల కాలంలో ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజలు క్రితం చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 4 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఆదివారం తెల్లవారుజామున 2.16 నిమిషాలకు 4.2 తీవ్రతలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం 516 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ ఉపరితలం నుంచి 8…
World's Highest Railway Bridge: రెండు దశాబ్ధాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నెలవేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ గా, ఇంజనీరింగ్ అధ్భుతంగా కొనియాడుతున్న చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలో ఎతైన రైల్వే వంతెన 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది.
Tigers Death: మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో రెండు పులులు మరణించాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగంపేట శివారులో పాతిపెట్టిన పులి కళేబరాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. పులి గోరు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. పులిని హత్య చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. 2018-19 మధ్య కాలంలో విద్యుత్ వైర్లు తగిలి పులి మరణించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. చనిపోయిన పులి వయస్సు ఎంత..? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై…
Huge Tornado Destroys US Towns: అమెరికాను టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు పట్టణాలు ధంసం అయ్యాయి. తీవ్రమైన గాలి, ఉరుములు, మెరుపులు, వర్షంతో టోర్నడోలు విరుచుకుపడటంతో మిసిసిపి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికే వీటి ధాటికి 25 మంది మణించారు. మరణాల సంఖ్య మరింగా పెరిగే అవకాశం ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మిసిసీపిలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.