World’s Highest Railway Bridge: రెండు దశాబ్ధాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నెలవేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ గా, ఇంజనీరింగ్ అధ్భుతంగా కొనియాడుతున్న చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలో ఎతైన రైల్వే వంతెన 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య నదిపై ఈ వంతెనను నిర్మించింది భారత ప్రభుత్వం. ఇది కట్రా, బనిహాల్ మధ్య కీలకమైన లింక్ గా ఉంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా(యఎస్బీఆర్ఎల్) రైల్వే లింకులో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టును రూ. 30,000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1400 కోట్లతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అన్ని సేఫ్టీ పరీక్షల్లో వంతెన పాస్ అయింది. 2003లో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు రెండు దశాబ్ధాల కాశ్మీరీ ప్రజల కల. అయితే అక్కడి పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది. చివరకు 2008లో అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణ కాంట్రాక్టులను ఓకే చేసింది.
Read Also: Tigers Death: చంద్రాపూర్, మంచిర్యాలల్లో పులుల మరణాలు.. ముగ్గురి అరెస్ట్
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అన్ని పరీక్షలు నిర్వహించామని, అవన్నీ విజయవంతం అయినట్లు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ వంతెన అధిక గాలులు, ఉష్ణోగ్రత, భూకంపాలను తట్టుకుంటుందా..? అనే పరీక్షలు నిర్వహించారు. వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, వంతెనపై రైల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రియాసి పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఈ వంతెనను స్టీల్, కాంక్రీట్ తో ఆర్చ్ నిర్మాణంలో నిర్వించారు. దీని పునాది పనులు నవంబర్ 2017న పూర్తయ్యాయి. ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని 120 ఏళ్ల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జ్ తో పాటు 12.7 కిలోమీటర్ల సొరంగాన్ని యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో చేపట్టనున్నారు. ఇండియా చరిత్రలో ఏ రైల్వే ప్రాజెక్టు ఎదుర్కోలేని సవాళ్లను ఈ బ్రిడ్జ్ ఎదుర్కొంది.