Illicit Affair: వివాహేతర సంబంధాలు కన్నవారి ఉసురుతీస్తున్నాయి. క్షణ కాలం సుఖం కోసం బంగారం లాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. భర్తలను హతమార్చడం, పిల్లలను చంపడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల జరిగాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమ బంధానికి అడ్డుగా వస్తున్నారని ప్రియుడి సహాయంతో ఓ తల్లి కొడుకు, కూతుర్ని హత్య చేసింది.
S Jaishankar: యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.
Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.
Karnataka: కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలు 10 శాతం ఆర్థికంగా బలహీన విభాగం(ఈడబ్ల్యూఎస్) కేటగిరిలో రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగా, లింగాయత్ లకు ఇవ్వనున్నారు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ధరలు దారుణంగా పెరిగాయి. ఇక ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ఇబ్బదిముబ్బడిగా పన్నులను పెంచింది. దీంతో అక్కడ విద్యుత్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. తాజాగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద డబ్బుల్లేవని వెల్లడించారు.
Missile Misfire: రాజస్థాన్ జైసల్మేర్ లోని పోఖ్రాన్ వద్ద ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. ఆర్మీ యూనిట్ ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. భారత ఆర్మీ చెబుతున్నదాని ప్రకారం క్షిపణి విమానంలో పేలింది. పోఖ్రాన్ రేంజ్ లో ఈ ఘటన జరిగింది. క్షిపణి విమానంలో ఉండగా పేలింది. శిథిలాలు పక్కన ఉన్న పొలాల్లో పడిపోయాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది. దీనిపై విచారణ ప్రారంభించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై పలువురు విదేశీ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు భారత-అమెరికా సంతతి నేత రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని, ఇది భారతీయ విలువలకు తీవ్రమైన ద్రోహం అని ట్వీట్ చేశాడు. రోఖన్నా యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ లో సిలికాన్ వ్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Earthquake: దేశంలో ఇటీవల కాలంలో పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లోని భట్గావ్ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.
Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. గత ఏడు రోజులుగా అతను తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానాలో ఆయనకు ఓ మహిళా ఆశ్రయం ఇచ్చిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడితో పాటు అతడి సన్నిహితుడు పప్పల్ ప్రీత్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చిన మహిళను అరెస్ట్ చేశారు. తలపాగా తీసేసి తన రూపాన్ని మార్చుకుని, గొడుగు చాటున వెళ్తున్న ఫోటో ప్రస్తుతం పోలీసులకు చిక్కింది.