Savarkar Row: రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘నా పేరు సావర్కర్ కాదు, నాపేరు గాంధీ.. నేను ఎవరికి క్షమాపణలు చెప్పను’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీతో పాటు అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము సావర్కర్ ను అభిమానిస్తామని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. దీంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి మధ్య విబేధాలు తలెత్తాయి.
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు పడింది.
Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి.
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే కిమ్ జోంగ్ ఉన్. ఆయన చేసేదే చట్టం, చెప్పేదే న్యాయం కాదని ఎవరైనా ఎదురుతిరిగితే అక్కడిక్కడే మరణించడం ఖాయం. అంతగా ఆ దేశాన్ని గుప్పిట పెట్టుకున్నాడు. ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసినంతగా, ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. చివరకు తెలుసుకోవాలని ప్రయత్నించినా మరణం తప్పదు. హాలీవుడ్, దక్షిణ కొరియా సినిమాలు చూస్తే, ఇంటర్నెట్ వాడినా, దేశం దాటాలని ప్రయత్నించినా, కిమ్ జోంగ్ ఉన్ తాత, తండ్రులను గౌరవించకపోయినా మరణం తప్పదు. అంత క్రూరంగా…
PM Modi: బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి ఒక నెలపాటు ప్రభుత్వ పథకాలను తమ…
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘ వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం గత 10 రోజులుగా వేట సాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానా మీదుగా ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. పూర్తిగా వేషధారణ మార్చి, తలపాగా తీసేసి మోడ్రన్ లుక్ తో తన రూపాన్ని మార్చుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. నేపాల్ కు పారిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు అమృత్ పాల్ సింగ్ ప్లాన్ చేస్తున్నాడు.
PAN And Aadhaar Link: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింకును పొడగించింది. మార్చి 31 వరకు పాన్, ఆధార్ లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని జూన్ 30 వరకు పొగడించారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఈ గడువును పొడగించింది. అయితే ఈ సారి గడువు ఉండదని ప్రకటించినప్పటికీ.. మరోసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Atiq Ahmed: ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో చక్రం తిప్పిన గ్యాంగ్ స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్దోషులుగా గుర్తించింది. హత్య, కిడ్నాప్ తో సహా అతిక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
Experts Explain The Science Behind Why Heartbreak Hurts So Much: ప్రేమలో పడటం చాలా మధురమైన అనుభూతి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రేమ ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే మనం ఎంతో ప్రేమించే వారు దూరం కావడం, చనిపోవడం వంటి విషయాల్లో చాలా ఎక్కువ మనోవేధన అనుభవిస్తారు. ఆ బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు శారీరకంగా, మానసికంగా చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. భావోద్వేగ పరిస్థితుల్లో అనుభవించే బాధ చాలా తీవ్రంగా…
Covid-19: దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు.