Earthquake: ఇటీవల కాలంలో ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజలు క్రితం చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 4 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఆదివారం తెల్లవారుజామున 2.16 నిమిషాలకు 4.2 తీవ్రతలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం 516 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Loan app fraud: లోన్ యాప్ పేరిట మోసం.. సిద్దిపేట, కరీంనగర్‌లో బాధితులు
ఈ వారం ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వత ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపంలో ఆఫ్ఘనిస్తాన్ లో నలుగురు, పాకిస్తాన్ లో 9 మంది మరణించారు. దీని ధాటికి ఉత్తర భారతంలోని రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకుని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం వరకు హిమాలయాలు భూకంపాలు అధికంగా వచ్చే ఏరియాగా ఉంది. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యూరేషియా టెక్టానిక్ ప్లేట్ పరస్పరం రాపిడికి గురవుతున్నాయి. దీంతో భూకంపాలు వస్తున్నాయి.