Atiq Ahmed: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్‌కు ప్రయాగ్ రాజ్ కోర్టు ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో జీవితఖైదు విధించింది. అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ తో పాటు మరో ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే అన్నదమ్ములకు ప్రస్తుతం ఎన్ కౌంటర్ భయం పట్టుకుంది. యూపీ పోలీసులు తమను ఎన్ కౌంటర్ చేస్తారనే భయం వారిని వెన్నాడుతోంది. అతీక్ అహ్మద్ జైలు నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ గత పది రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచి పోషించేందుకు దేశ అంతర్గత శక్తులతో కలిసి కుట్ర పన్నాడు. దీంతో పంజాబ్ పోలీసులు అతడిపై అతని అనుచరులపై భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే అతని అనచరులను ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అమృత్ పాల్ సింగ్ మాత్రం హర్యానా మీదుగా ఢిల్లీ చేరుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు…
Ajit Doval: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సభ్యదేశాలు పరస్పరం తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎస్సిఓ స్థాయి ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
39 killed in fire near Mexico-USA border: సొంత దేశంలో ఉండలేక, అమెరికాకు వెళ్ధామనుకున్న శరణార్ధులను అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. మెక్సికోలిని సిడెడ్ జారే నగరంలోని శరణార్థి శిబిరంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 39 మంది శరణార్థులు మరణించినట్లు తెలుస్తోంది. మెక్సికన్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 39 మంది మరణించగా.. 29 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయమంగా…
PM Narendra Modi: బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ సంస్థ నుంచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగేందుకు పార్టీ కార్యకర్తల అంకితభావం, త్యాగాలే కారణం అని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణలో ఉన్న పలు రాజకీయ పార్టీ మధ్య బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని అభివర్ణించారు. బీజేపీ అత్యంత భవిష్యత్ వాద పార్టీగా అవతరించిందని ఆయన అన్నారు.
Ram Mandir: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు కోటి కళ్లలో రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ సారి శ్రీరామ నవమి వేడుకలు అయోధ్య రామ మందిరం సిద్ధం అవుతోంది. రామ నవమి వేడుకలు తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం పూర్తై, రామ మందిరంలోనే నవమి వేడుకలు జరగనున్నాయి.
Donald Trump: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆయన అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మరోసారి ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని తాను 24 గంటల్లో పరిష్కరించగలనని తెలిపాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అధ్యక్షత వహించడం ద్వారా తాను యుద్ధాన్ని అంతం చేస్తానని…
18 Pharma Companies To Lose Licenses Over Poor Quality Medicines: దేశవ్యాప్తంగా నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీసీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Earthquake: జపాన్ భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఆ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం సాయంత్ర 6.18 గంటలకు 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలను జపాన్ జారీ చేయలేదు.
No-confidence Motion Against Lok Sabha Speaker: రాహుల్ గాంధీ అనర్హత దేశంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న సమాచారం ప్రకారం సోమవారం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకురావచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. కాగా, ఇతర పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.