Huge Tornado Destroys US Towns: అమెరికాను టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు పట్టణాలు ధంసం అయ్యాయి. తీవ్రమైన గాలి, ఉరుములు, మెరుపులు, వర్షంతో టోర్నడోలు విరుచుకుపడటంతో మిసిసిపి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికే వీటి ధాటికి 25 మంది మణించారు. మరణాల సంఖ్య మరింగా పెరిగే అవకాశం ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మిసిసీపిలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
Read Also: Misbehave : మరదలిపై కన్నేసిన బావ.. అర్ధరాత్రి వెళ్లి ఏం చేశాడంటే ?
మిసిసిపి తో పాటు అలబామాలోని గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి టోర్నడోలు విరుచుకుపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. జాక్సన్, సిల్వర్ సిటీ, షార్కీ కౌంటీ, రోలింగ్ ఫోర్క్ పట్టణాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గంటలకు 113 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ పోల్స్, చెట్లు విరిగిపడిపోయాయి. గాలులకు తోడుగా వడగళ్లు కురిశాయి. బాధితుల కోసం అధికారులు ఆరుచోట్ల పునరావాస కేంద్రాలను తెరిచారు. పూర్తిగా సర్వే చేయనిదే నష్టాన్ని అంచనా వేయలేమని మిసిసిపి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రజలను రక్షించడమే తమ ప్రథమ బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. నా నగరం పూర్తిగా దెబ్బతిన్నదని రోలింగ్ ఫోర్స్ మేయర్ ఎల్డ్రిడ్జ్ వాకర్ అన్నారు.