Tigers Death: మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో రెండు పులులు మరణించాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగంపేట శివారులో పాతిపెట్టిన పులి కళేబరాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. పులి గోరు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. పులిని హత్య చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. 2018-19 మధ్య కాలంలో విద్యుత్ వైర్లు తగిలి పులి మరణించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. చనిపోయిన పులి వయస్సు ఎంత..? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ జరగుతోందని అటవీ శాఖ వెల్లడించింది.
Read Also: Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. పలు పట్టణాలు ధ్వంసం..
ఇక మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో మరో పులి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగర్ గాం శివారులో తాడోబా అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని అధికారులు గుర్తించారు. మగపులి చనిపోయి 8, 9 రోజులు అయిందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పులి ఎలా మరణించిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఇటీవల కాలంలో మహారాష్ట్ర, తెలంగాణల మధ్య పులుల సంచారం ఎక్కువ అయింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని పులులు వస్తూపోతూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులులు కదలికలు పెరిగాయి. ఈ రెండు అభయారణ్యాల మధ్య పులులు ఓ కారిడార్ ను ఏర్పరుచుకున్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం పులుల కదలికతో వణికిపోతున్నారు.