Security for The Tree: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ చెట్టును కంటికి రెప్పలా కాపాడుతోంది. దీనికి చుట్టూ కంచె, రక్షణగా సాయుధులైన నలుగురు గార్డులు 24 గంటలకు చెట్టుకు చూసుకుంటున్నారు. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏకంగా లక్షల్లో వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు నీరు పోసేందుకు రూ.64 లక్షలు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ రైసెన్ లోని సాంచి స్థూపం సమీపంలో ఈ చెట్టును నాటారు. దీనికి పగలు, రాత్రి సెక్యూరిటీ ఇస్తున్నారు.
Read Also: Immoral Relationship : ప్రియుడిని అన్నయ్య అంది.. అతడి చేతిలోనే హతమైంది
అసలు ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో తెలుసా..? అది ఓ బోధి వృక్షం. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన చెట్టుగా ప్రసిద్ధి చెందింది. దాదాపుగా 2500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడికి గయాలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది. 250 బీసీఈలో అశోక చక్రవర్తి ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాడు. అశోకుడు ఆ చెట్టు కొమ్మను రాజు దేవానాంప్రియ తిస్సాకు బహుమతిగా ఇచ్చి శ్రీలంక పంపాడు. అతడు దాన్ని తన రాజధాని అనురాధపురలో నాటాడు.
అయితే 2012లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే ఆ చెట్టు కొమ్మను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో సలామత్ పూర్ సమీపంలో కొండపై నాటారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ చెట్టుకు రక్షణ ఇస్తోంది. ఇప్పటి వరకు చెట్టుకు నీళ్లు పోయడానికే రూ.64 లక్షలు ఖర్చు అయ్యాయి. దాదాపుగా నెలకు ఈ చెట్టు నిర్వహణకు లక్షల్లో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఆకు గొంగళి పురుగు సోకి చెట్టుకు తెగుళ్లు వస్తున్నాయి. అయితే ఈ చెట్టు సంరక్షణకు హర్టీకల్చర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది.