కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం దావణగేరేలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా ఓ వ్యక్తి ప్రధాని కాన్వాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక హుబ్బళ్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. మోదీకి దగ్గరగా వెళ్లాలనుకున్న వ్యక్తని కొప్పల్ జిల్లాకు చెందిన యువకుడిగా పోలీసులు…
అమృత్ పాల్ సింగ్ కు సపోర్టుగా కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు అతడికి మద్దతు తెలుపుతూ ఆందోళనలకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తాన్ మద్దతుదారులు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్తాన్ జెండాను ఎగరేస్తామని బెదిరిస్తున్నారు. ముంబై నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ కు రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ రావడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం దర్యాప్తు చేస్తోంది.
Jacqueline Fernandez: రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో సుకేష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవడ్ యాక్టర్, సుకేష్ ప్రేయసి జాక్వలిన్ ఫెర్నాండేస్ కు లవ్ లెటర్ రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను ప్రేమలేఖలో వ్యక్త పరిచాడు.
Rahul Gandhi: అదానీపై నా తరువాతి ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశాను. నేను ఏ ప్రశ్న అడిగిన ఆలోచించే అడుగుతానని అన్నారు. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైళ్లలో వేయండి అని అన్నారు. దేశం నాకు గౌరవం, ప్రేమ ఇచ్చారని అన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోందని అన్నారు. నేను జైలు శిక్ష గురించి భయపడనని అన్నారు. ప్రజల్లోకి వెళ్లడమే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం…
Rahul Gandhi: పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష, పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత పడిన తర్వాత రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడారు. డిస్ క్వాలిఫై చేసినా, జైలులో పెట్టిన భయపడనని, నేను భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాని, తాను సత్యాన్నే మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు.
Maruti Suzuki Fronx, Jimny launch details: ఇండియాలో అతిపెద్ద కార్ మేకర్ గా ఉన్న మారుతి సుజుకీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రాంక్స్, జమ్నీ కార్లు రాబోతున్నాయి. వీటికి జనాల్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ రెండు ఎస్ యూ వీలను మారుతి 2023 ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. అయితే ఇప్పటికే ఈ కార్లకు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కానీ ఇవి ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
Donald Trump: తనపై అభియోగాలు మోపితే మరణాలు, విధ్వంసమే అని ట్రంప్ హెచ్చరించారు. స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ విచారణలో అభియోగాలు మోపితే బాగుండంటూ మాన్ హట్టన్ అటార్నీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ముందు పోర్న్ స్టార్ తో సంబంధాల గురించి బయటపడకుండా డబ్బులతో ప్రలోభపెట్టాడనే కేసును మాన్ హట్టన్ అటార్నీ విచారించేందుకు సిద్ధం అయిందని, తనపై అభియోగాలు మోపి రోజుల్లో అరెస్ట్ చేస్తారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
Maharashtra: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. మృగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా రేపిస్టులు భయపడటం లేదు. ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఉదంతం బయటకు వస్తూనే ఉంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
Asteroid Close To Earth: గ్రహ శకలాలు, తోక చుక్కలు అత్యంత అరుదుగా భూమి సమీపంలోకి వస్తుంటాయి. దశాబ్ధాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి ఖగోళ అద్భుతాలు జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు గ్రహశకలాలు భూమికి ప్రమాదాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంది. డైనోసార్ల వంటి భారీ జంతువులు భూమిపై తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడమే అని అందరికి తెలిసిన విషయం.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశరాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. ఆయనకు క్రిమినల్ పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. అయితే అతడికి పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. ఈ శిక్ష ఏకంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవి పోయేలా చేసింది. శిక్ష పడిన వెంటనే పార్లమెంటరీ సెక్రటరీ రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.