Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఖలిస్తానీ ఉగ్రవాది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నేత అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు బెదిరింపు కాల్ చేసి, సీఎంను బెదిరించే ప్రయత్నం చేశారు. అస్సాంలో ఖైదీలుగా ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు హింసించబడుతున్నారని, సీఎం శర్మ జాగ్రత్తగా వినండి.. ఇది ఖలిస్తాన్ అనుకూల సిక్కులు, భారత ప్రభుత్వానికి మధ్య పోరాటం అని పన్ను హెచ్చరించాడు.
Amit Shah: సీఎం నితీష్ కుమార్ అధికార దాహం వల్లే లాలా ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీహార్ నవడాలో పర్యటించిన ఆయన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం నవడా జిల్లాలోని హిసువా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీహార్ లో రామనవమి రోజుల చెలరేగిన మతఘర్షణల గురించి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంగిల్ రాజ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న ప్రభుత్వం బీహార్ లో శాంతిని నెలకొల్పుతుందా..? అని…
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ అల్లాడుతోంది. కనీసం అక్కడి ప్రభుత్వం ప్రజలకు తినేందుకు తిండిని కూడా ఇవ్వలేకపోతోంది. ఎక్కడ చూసిన ఆహారం కోసం తొక్కిసలాటలు, కొట్లాటలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇలా అన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే తిండి గింజలు ప్రజలకు చేరకముందే రాత్రికి రాత్రి మాయం అవుతున్నాయి.
IIT-Madras PhD Student Dies By Suicide: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మద్రాస్. ఎంతో మందిని గొప్పవారిని దేశానికి అందించింది. అయితే ఇటీవల మాత్రం తరుచు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Congress Files: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో పాటు వరసగా ప్రధాన రాష్ట్రాలు అయిన కర్ణాటక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది.
Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ముస్సోరీ డెహ్రాడూన్ మార్గంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముస్సోరీ డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా షేర్ఘాడీ సమీపంలో 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.
Rajnath Singh: భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలు తమ రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేసేలా, తద్వారా సాంకేతికలను…
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ కామెంట్స్ చేశారు.