Ajit Pawar comments on Modi's degree: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిగ్రీపై ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ డిగ్రీలను బహిర్గత పరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు జరిమానా కూడా విధించింది. చదువులేని ప్రధాని దేశానికి ప్రమాదం అంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోదీ డిగ్రీ చూపించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Record car sales: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.
Mansukh Mandaviya: కరోనా ఒక వైరస్, ఇది పరివర్తన చెందుతూనే ఉంటుందని, భారతదేశంలో ఇప్పటి వరకు 214 విభిన్న రకాలను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఇటీవల కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, వారానికోసారి సమీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కావని ఆయన అన్నారు.
Finland joins NATO military alliance: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేసింది. మరో స్కాండనేవియన్ దేశం స్వీడన్ ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు మొగ్గు చూపాయి. తాజాగా ఫిన్లాండ్ దేశం కూటమితో సభ్య దేశంగా చేరింది. దీంతో నాటో ఆధిపత్యం రష్యాకు మరింత సమీపంలోకి వచ్చినట్లు అయింది.
Artemis 2:అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ చేపట్టబోతోంది. దాదాపుగా 50 ఏళ్ల తరువాత తొలిసారిగా మానవుడు మరోసారి చంద్రుడి వద్దకు వెళ్లబోతున్నాడు. తాజాగా సోమవారం ఈ మూన్ మిషన్ కు సంబంధించి వ్యోమగాముల పేర్లను వెల్లడించింది నాసా. నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. ఆర్టెమిస్ 2 వ్యోమనౌక ద్వారా జెరెమీ హాన్సెస్, రీడ్ వైజ్ మన్, క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్ లు చంద్రుడి పైకి వెళ్లనున్నారు.
China: రష్యా తన మిత్రదేశాలు, దానికి సంబంధించిన విదేశాంగ విధానంపై ఇటీవల ప్రకటన జారీ చేసింది, తన మిత్ర దేశాలైన చైనా, భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్తగా ఫారిన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తన మిత్రదేశాల ఏవో, శతృదేశాలేవనే దాని గురించి చెప్పకనే చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను శతృవుగా చూస్తుండటంతో కొత్త విదేశాంగ విధానం ద్వారా రష్యా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Saudi Arabia: ఇస్లాం దేశాల్లో మరణశిక్షలు సర్వసాధారణం. హత్యలు, డ్రగ్స్, వ్యభిచారం ఇలాంటి కేసుల్లో ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, యూఏఈ వంటి దేశాలు కఠినంగా వ్యవహరిస్తాయి. అయితే అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో మాత్రం శిక్షల విధింపు దాదాపుగా ఉండదు.
China renames 11 places in Arunachal Pradesh: జిత్తులమారి చైనా భారత్ తో స్నేహం అంటూనే తాను చేయాల్సిన పనులు చేస్తోంది. ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టిస్తూ భారత్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత భూభాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టింది. 11 ప్రాంతాలకు మూడో విడతగా చైనా పెట్టింది. చైనా, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లను విడుదల చేసింది. చైనా పౌర…
Mughals Out Of Syllabus: సీబీఎస్ఈ, ఉత్తర ప్రదేశ్ బోర్డులు మొఘలుల చరిత్రను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మొఘలులు చరిత్రకు సంబంధించిన పలు పాఠ్యాంశాలు సిలబస్ లో భాగం కావు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి అత్యున్నత సలహా సంస్థ ఎన్సిఇఆర్టి చరిత్రలో పలు పాఠ్యాంశాలను సవరించింది. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించి మధ్యయుగపు పాఠ్యపుస్తకాల నుంచి ‘కింగ్స్ అండ్ క్రానికల్స్’ అండ్ ‘ ది మొఘల్ కోర్ట్స్’ అధ్యాయాలను తొలగించారు.