Rajnath Singh: భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలు తమ రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేసేలా, తద్వారా సాంకేతికలను భారత్ అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
Read Also: Mango Juice: ఈ సీజన్లో మామిడి పండ్లు మిస్సయితే అంతే సంగతులు
రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం హైకి చేరుకోవడం భారత దేశ ప్రగతికి నిదర్శమని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ.. ‘‘ఎక్స్‌లెంట్ భారతీయుల ప్రతిభ, మేక్ ఇన్ ఇండియా పట్ల గల ఉత్సాహానికి ఈ గణాంకాలే నిదర్శనం’’ అని అన్నారు. ఈ రంగంలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఇది నిరూపిస్తోందని, భారత్ ను రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా మార్చే ప్రయత్నాలకు కేంద్రం మద్దతు ఇస్తూనే ఉంటుంది అని ప్రధాని పేర్కొన్నారు.
రూ. 1.75 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు తయారీతో పాటు 2024-25 నాటికి ఈ ఎగుమతులను రూ.35 వేల కోట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోంది. 2021-22లో దేశ రక్షణ రంగ ఎగుమతులురూ. 12,814 కోట్లు, 2020-21లో రూ.8,434 కోట్లు, 2019-20లో రూ. 9,115 కోట్లు, 2018-19లో రూ. 10,745 కోట్లుగా ఉంది.