Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఖలిస్తానీ ఉగ్రవాది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నేత అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు బెదిరింపు కాల్ చేసి, సీఎంను బెదిరించే ప్రయత్నం చేశారు. అస్సాంలో ఖైదీలుగా ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు హింసించబడుతున్నారని, సీఎం శర్మ జాగ్రత్తగా వినండి.. ఇది ఖలిస్తాన్ అనుకూల సిక్కులు, భారత ప్రభుత్వానికి మధ్య పోరాటం అని పన్ను హెచ్చరించాడు.
Read Also: Minister Mallareddy: హే.. మంత్రి మల్లారెడ్డి మళ్లీ వేసేశారుగా..
అనవసరంగా హింసకు గురికావద్దని సీఎంను బెదిరించారు. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ శాంతియుత ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా భారత ఆక్రమణలో ఉన్న పంజాబ్ ను విముక్తి చేయాలని కోరుతున్నామని, అస్సాం ప్రభుత్వం ఆరుగురు ఖలిస్తానీ వేర్పాటువాదుల్ని( దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్ పాల్ సహాయకులు) చిత్ర హింసలకు గురిచేస్తున్నారు, దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్, అతని సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’పై మార్చి 18 నుంచి పంజాబ్ పోలీసుల అణిచివేత ప్రారంభం అయింది. అప్పటి నుంచి వందల్లో ఖలిస్తానీ మద్దతుదారులు, అతడి సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అమృత్ పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. భద్రతా కారణాల రీత్యా అతడి సహాకులను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.