Congress Files: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో పాటు వరసగా ప్రధాన రాష్ట్రాలు అయిన కర్ణాటక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. యూపీఏ హయాంలో కాంగ్రెస్ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ ‘‘ కాంగ్రెస్ ఫైల్స్’’ పేరుతో వీడియో ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అవినీతిని వీడియో సిరీస్ రూపంలో తీసుకువచ్చినట్లు దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ను బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.
Read Also: Icecream : సీలింగ్ ఫ్యాన్‌తో ఐస్‌క్రీం తయారీ.. మహిళను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లతో మూడు నిమిషాల వీడియో క్లిప్ తో పాటు యూపీఏ హయాంలో
రూ.48,20,69,00,00,000 అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. 2G కేసు, బొగ్గు కుంభకోణం మరియు కామన్వెల్త్ గేమ్స్ వరుస వంటి వివిధ కుంభకోణాలలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ‘‘ భ్రష్టాచారి బచావో ఆందోళన్’’ కార్యక్రమాన్ని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత బీజేపీ ఈ తరహా ప్రచారాన్ని ప్రారంభించింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీలను దుర్వినియోగపరుస్తున్నాయంటూ 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో బీజేపీ తాజాగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసింది. ఇదిలా ఉంటే అవినీతిపరులపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుంటుంటే కొన్ని పార్టీలు ‘భ్రష్టాచారి బచావో అభియాన్’’ ప్రారంభించాయని బీజేపీ విమర్శిస్తోంది.
Congress Files के पहले एपिसोड में देखिए, कैसे कांग्रेस राज में एक के बाद एक भ्रष्टाचार और घोटाले हुए… pic.twitter.com/vAZ7BDZtFi
— BJP (@BJP4India) April 2, 2023