Mohan Bhagwat: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గుడుస్తున్నా.. పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. భారత్ తో ఎందుకు విడిపోయామా అని అనుకుంటున్నారని, భారత్ విభజన పొరపాటుగా భావిస్తున్నారని అన్నారు. శుక్రవారం సింధీ యువవిప్లవకారుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు సంతోషంగా ఉందా..? అని ప్రశ్నించారు. అక్కడ ప్రజలు బాధ అనుభవిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం…
Stormy Daniels: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ల తరుపున పోటీ చేద్ధాం అని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ శృంగార తార చేసిన ఆరోపణలు ఆయన్ను జైలు పాలయ్యేలా చేస్తున్నాయి. ఈ పోర్న్ స్టార్ పేరే స్టార్మీ డేనియల్స్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ట్రంప్ తో శృంగారం గురించి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లను అందించినట్లు స్టార్మీ డేనియల్స్ ప్రకటించడం అమెరికాను ఓ కుదుపుకుదిపేసింది. ప్రస్తుతం మాన్ హట్టన్ అటార్నీ ట్రంప్…
Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే మాల్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్ని అత్యాచారానికి సహకరించారు. సెక్యూరిటీ గార్డు బలవంతం చేస్తుంటే సూపర్ వైజర్, హౌస్…
Killer Plant Fungus: ప్రపంచంలో అత్యంత అరుదుగా మొక్కల్లో సోకే ఫంగస్ మనుషులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిలో కనుక్కున్నారు. మొక్కలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తి మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే ప్లాంట్ మైకాలజిస్ట్. మొక్కల శిలీంధ్రాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే సదరు వ్యక్తికి శిలీంద్రం ఇన్ఫెక్షన్ సోకింది.
April Fools' Day: ఏప్రిల్ ఫూల్స్ డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 1 వచ్చిందంటే మిత్రులు, సన్నిహితులు ఒకరినొకరు ఆటపట్టించడం, అబద్ధాలు చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా అబద్ధాలు నమ్మితే ఫూల్స్ అయ్యారంటూ ఆట పట్టిస్తుంటారు. అయితే ఏప్రిల్ 1 రోజున మాత్రమే ఇలా ఎందుకు జరుపుకుంటారు..? అనే సందేహం చాలా మందిలో వస్తుంది. అయితే దీని వెనక పలు రకాల కథలు ఉన్నాయి.
PM Narendra Modi: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని పలు ప్రాంతాల్లో ‘‘మోదీ హఠావో-దేశ్ బచావో’’ వ్యాఖ్యలతో పోస్టర్లను అంటించారు ఆప్ కార్యకర్తలు. దేశవ్యాప్తంగా పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టర్లు అంటించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారు తమ పార్టీ కార్యకర్తలే అని గుజరాత్ ఆప్ చీఫ్ ఇసుదన్ గాధ్వీ అన్నారు. బీజేపీ నియంతృత్వ…
Amit Shah: శ్రీరామ నవమి రోజు పశ్చిమ బెంగాల్ హౌరాలో తీవ్ర హింస చెలరేగింది. హౌరాలోని కాజీపారా, శిబ్ పూర్ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నవమి తర్వాత రోజు కూడా హౌరాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. కొంతమంది గుంపు ఇళ్లపై రాళ్ల దాడులు చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో పరిస్థితి ఆరాతీయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్…
Pakistan: మైనారిటీ హక్కుల గురించి భారతదేశానికి నీతులు చెప్పాలని ప్రయత్నించే పాకిస్తాన్ తన దేశంలో మైనారిటీల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ప్రతీ సంవత్సరం వందల్లో మహిళలు, బాలికలు కిడ్నాపులకు గురవుతూ.. బలవంతపు పెళ్లిళ్లు చేసి మతాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో హిందూ బాలికలు, మహిళల బలవంతమపు మతమార్పిడులు, వివాహాలపై పాకిస్తాన్ మైనారిటీ హిందూ సమాజానికి చెందిన పలువురు సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల, సింధ్ అసెంబ్లీ…
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.