భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు. పాక్‌తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు. కానీ… వారికి ఆ ఆలోచనే రాలేదని చెప్పారు.
‘‘మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత్ సరిహద్దుకు అవతల కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. మనవైపు ఒక టవర్ కట్టారు. టవరెక్కి సిక్కులు దుర్బణిలో చూసి దర్శించుకునేవారు. నేను పంజాబ్‌లో పనిచేస్తున్నప్పుడు
ఇంత అవమానాన్ని ఎలా సహిస్తున్నారని అనుకునేవాడిని. నేను వచ్చాక పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నించాను. ఒక దారి దొరికింది ఇప్పుడు సిక్కులు వెళ్లి హాయిగా దర్శించుకుంటున్నారు. చారిత్రక ప్రదేశాలకు చాలా విశిష్టత ఉంటుంది.’’ అని తెలిపారు.
అంబేద్కర్ గురించి మాట్లాడుతూ..
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించి పంచతీర్థాల అభివృద్ధిపై నేను దృష్టి పెట్టాను. అంబేద్కర్ జన్మించిన ప్రాంతం.. ఆయన యూకేలో నివసించిన ప్రాంతం. అంబేద్కర్ దీక్ష స్వీకరించిన చోటు.. ఆయన పని చేసిన ప్రాంతం. ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన పుణ్యప్రదేశం. ఈ ఐదు ప్రాంతాలను నేను చాలా బాగా అభివృద్ధి చేశాను. ఒకచోట ఇంకా పని జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ జీవన చిత్రాన్ని అవగాహన చేసుకునేందుకు పంచ్ దీక్ష యాత్ర ఉపయోగపడుతుంది.’’ అని వివరించారు
‘‘స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టమైన దండి ఉద్యమాన్ని అంతా విస్మరించారు. నేను దండి ఉద్యమాన్ని మళ్లీ కళ్లకు కట్టేలా పునర్‌నిర్మించాను. ప్రపంచం భారతదేశాన్ని ఒకమహాశక్తిగా చూడాలన్నది నా కోరిక. అదే స్టాట్యూ ఆప్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే అది రెండింతల పెద్ద విగ్రహం. టూరిజాన్ని డెవలప్ చేయడం.. ముఖ్యమైన ప్రదేశాలను పునరుద్ధరించడం.. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. దేశ ప్రతిష్టను పెంచుతాయి. అందుకోసం మేం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.