ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. నిబంధనల ప్రకారం అతడికి సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉంటున్నాడు. శ్రీ ఖదూర్ సాహెబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేశాడు. నామినేషన్ దాఖలు చేసేందుకు తాత్కాలికంగా జైలు నుంచి విడుదల చేయాలని అభ్యర్థించాడు. తన నామినేషన్ దాఖలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ఎన్నికల అధికారి, డిప్యూటీ కమిషనర్‌ను కోరినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు.
ఇది కూడా చదవండి: AP High Court: లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు
అమృత్‌పాల్ నామినేషన్‌పై న్యాయస్థానానికి పంజాబ్ ప్రభుత్వం సమాచారం అందించింది. తాము డిబ్రూగఢ్ జైల్లో న్యాయవాదితో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. చట్ట ప్రకారం ప్రమాణ పత్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డీఏజీ అర్జున్ షోయిరన్ వెల్లడించారు. మే 9వ (గురువారం) తేదీన అమృత్‌పాల్ సింగ్ ఖదూర్ సాహెబ్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశాడు.
ఇది కూడా చదవండి: Sabitha Indra Reddy : మళ్లీ కేసీఆర్ పాలన కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతివ్వాలి
అమృత్ పాల్ సింగ్ అనుచరులు ఫిబ్రవరి 24న పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. దీంతో స్టేషన్‌లో ఉన్న అతని సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్‌ను వదిలివేయాల్సి వచ్చింది. యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఇక ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: Engagement Off: ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందనే కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..