లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు.. నకిలీ పార్టీలుగా అభివర్ణించారు. మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో శుక్రవారం లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. నందుర్‌బార్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో మోడీ పర్యటించారు.
ఇది కూడా చదవండి: Team India: టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా
మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయవచ్చని శరద్ పవార్ సూచించారని.. ఈ నేపథ్యంలో శరద్ పవార్, థాకరేలు తమ పార్టీలో చేరాలని ప్రధాని మోడీ సూచించారు. శరద్ పవార్, శివసేన (యూబీటి) చీఫ్ థాకరేలిద్దరూ అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో చేరాలన్నారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘నకిలీ ఎన్సీపీ, శివసేన’లు కాంగ్రెస్‌లో విలీనానికి సిద్ధమయ్యాయని మోడీ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: “మీ అన్న అమేథీలో ఓడిపోయారు”.. ప్రియాంకాగాంధీపై ఓవైసీ ఆగ్రహం..
బారామతిలో ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడు చాలా టెన్షన్ పడుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. చిన్న పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రకటన చేశారని గుర్తుచేశారు. పలువురి నేతలతో సంప్రదించిన తర్వాతే ఈ ప్రకటన చేసి ఉంటారని కచ్చితంగా అనుకుంటున్నట్లు తెలిపారు. గౌరవప్రదంగా ఉండానికి.. మీ కలలు నెరవేర్చుకోవడానికి ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలపాలని మోడీ సూచించారు. బారామతికి మూడో విడతలో.. అనగా మే 7న పోలింగ్ జరిగింది. ఇక్కడ శరద్ పవార్ కుమార్తె సుప్రీయ.. అజిత్ పవార్ సతీమణి బరిలో నిలబడ్డారు.
నందుర్‌బార్ స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన గోవాల్ పదవీ, బీజేపీ నుంచి హీనా గవిని పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మే 13న నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Jasmine flowers: మల్లెపూలను ఎక్కువగా పెట్టుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్..