దుబాయ్‌లో దారుణం జరిగింది. భారతీయ యువకుడిని పాకిస్థానీయుల గుంపు అత్యంత దారుణంగా చంపేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
లండన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మెట్రో స్టేషన్లు, రైళ్లు, విమానాలు గొడవలకు, కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆయా మెట్రో రైళ్లలో ఫైటింగ్‌లు జరుగుతూనే ఉంటున్నాయి.
అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
భారతీయ కుర్రాడు తన టాలెంట్‌తో అమెరికా న్యాయనిర్ణేతలను ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏమి ప్రతిభ.. డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లతో ఉత్సాహపరిచారు. దీంతో ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. శుక్రవారం(జూలై 12న) కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.
బీహార్‌లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. రాష్ట్రంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి.. ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు.
భారత్-చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఇండో-చైనా సరిహద్దు సమీపంలో కిలోగ్రాము బరువున్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు సరిహద్దు రక్షణ దళానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.
ఆమె ట్రైనింగ్‌లో ఉన్న ఒక ఐఏఎస్. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించింది. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఆమె మాత్రం అధికార దర్పం అనుభవించాలని ముచ్చట పడింది