తెలుగు సినీ పరిశ్రమలో తనదైన యూత్‌ఫుల్ కామెడీ టైమింగ్, వినోదాత్మక కథనంతో విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘చలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల, ఇకపై కేవలం మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా, కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా మారారు. తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ (What Next Entertainments)ను స్థాపించి, తన తొలి చిత్ర నిర్మాణాన్ని అధికారికంగా ప్రకటించారు.
Also Read :Thaman: తమిళ్ ఫీలింగ్ ఎక్కువ.. అనిరుధ్‌తో పోలిక.. థమన్ సంచలన వ్యాఖ్యలు!
సాధారణంగా సక్సెస్ ఫుల్ దర్శకులు తమ స్థాయిని పెంచుకునే క్రమంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం, కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన విషయం కాదు. వెంకీ కుడుముల కూడా ఈ మార్గాన్నే ఎంచుకుని, తన మొదటి ప్రాధాన్యతను కొత్త ప్రతిభను ప్రోత్సహించడం మరియు ప్రత్యేకమైన కథలకు ప్రాణం పోయడంగా ప్రకటించారు. వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ తొలి ప్రయత్నంలోనే నూతన తరాన్ని ప్రోత్సహించారు. ఈ సినిమాకు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్ ఉప్పల దర్శకత్వం వహించనున్నారు.
Also Read :Lionel Messi Hyderabad Tour: కలకత్తా మెస్సీ టూర్‌లో గందరగోళంతో హైదరాబాద్ లో భద్రత పెంపు!
హీరోగా టాలీవుడ్‌కు కొత్తగా పరిచయం కానున్న ‘#NewGuyInTown’ ఎవరో రేపు (టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు) అధికారికంగా వెల్లడి కానుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న అనస్వర రాజన్ నటిస్తోంది. మలయాళంలో ఇప్పటికే పలు హిట్ చిత్రాల్లో నటించిన అనస్వర, ఈ సినిమాలో నటిస్తోంది. సాంకేతిక నిపుణులను కూడా స్టార్లతో కాకుండా, ప్రతిభావంతులైన కొత్తవారితో ఎంచుకోవడం విశేషం. సంచలన సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, టైటిల్ మరియు హీరో వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.