దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లగా.. బుధవారం మాత్రం కొనుగోళ్లు ఆవిరైపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడి కొనసాగింది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఆప్‌కు గుడ్‌బై చెప్పారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కమలనాథులు.. కర్తార్ సింగ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆదివారం గుజరాత్‌లోని హైవేపై 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రక్షణ గోడపై నుంచి పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం సపుతర కొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు.
ప్రధాని మోడీ రెండ్రోజుల రష్యా పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం పర్యటన ముగియడంతో అక్కడ నుంచి మోడీ ఆస్ట్రియాకు బయల్దేరి వెళ్లారు. మాస్కో నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు.
ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మనీలాండరింగ్ కేసులో ఊరట దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నిరాకరించింది.
ఆ తండ్రి, కొడుకు ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి ట్రైన్ కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘోర విషాదం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వేస్టేషన్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ముంబై వేదికగా ముఖేష్ అంబానీ ఇంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఆయా కార్యక్రమాలతో సంబరాలు జరిగాయి. ఇక మంగళవారం జరిగిన హల్దీ వేడుక అంబారాన్నింటాయి.
యూఎస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జూలియా చాఫే ఎయిర్‌పోర్టులో తన లగేజీ పోగొట్టుకుంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి కోసం భారత్‌కు వస్తున్నప్పుడు ఎయిర్‌లైన్‌లో తన లగేజీని పోగొట్టుకుంది. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా సమాచారాన్ని తెలియజేసింది.
గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో మోడీ చర్చించి కీలకమైన సూచన చేశారు.
ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. సోమవారం ప్రధాని మోడీకి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి మోడీ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.