అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య ఏడడుగుల బంధంతో జంట ఒక్కటైంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.. ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హమాస్‌తో భీకరమైన యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 నెలల నిర్బంధ సైనిక సేవ పరిమితిని మూడేళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తవ్వేకొద్దీ ఆమె బండారం బయటడుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వేటు వేయించుకున్న ఆమె.. కొత్త కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటోంది.