కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు. పౌరులను తప్పుదారి పట్టించేందుకు డీప్‌ఫేక్‌లను వ్యాప్తి చేసే ఈ మోసపూరిత చర్య అసహ్యకరమైనదని సంఘవి అన్నారు.
ఇది కూడా చదవండి: Thangalaan: తంగలాన్ ట్రైలర్.. మెంటల్ మాస్ రా ఇది..
జీఎస్టీకి సంబంధించిన పన్నుల విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లుగా ఉన్న నకిలీ వీడియోలను చిరాగ్ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నకిలీ వీడియో అంటూ రాష్ట్ర మంత్రి కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఇక ఈనెల 23న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కూర్పులపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ వీడియో కలకలం సృష్టించడంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.