శుక్రవారం ముంబైలో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కావడంతో దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా రానున్నారు.
గోవాలో మంత్రి నీల్కాంత్ హలాంకర్ కారును అడ్డుకున్న నటుడు గౌరవ్ బక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెబ్ సిరీస్‌లు, కొన్ని చిత్రాల్లో నటించిన బక్షి.. మంత్రి కారును అడ్డుకున్నారు.
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12, అనగా శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ముంబైలోని పెళ్లి వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు.
దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఒక మహిళ గుండెలో నుంచి పెద్ద నిమ్మకాయంత కణితి తొలగించి విజయం సాధించారు. పేషెంట్ పూర్తి ఆరోగ్యం పొందుకోవడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ సర్జరీ అరుదైనదిగా ఆస్పత్రి పేర్కొంది.
దేశంలో అత్యంత కష్టమైంది సివిల్స్ పరీక్షలే. కఠోర దీక్షతో చదివితేనే తప్ప ఈ అత్యున్నతమైన ఐఏఎస్.. ఐపీఎస్ పోస్టులను సాధించలేరు. ఈ ఉద్యోగాలు పొందడం ఆషామాషీ విషయం కాదు. అంత కష్టమైన ఉద్యోగాల్ని సాధించాక.. ఎంత జాగ్రత్తగా ఉండాలి.
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఆకాశంలో ఉరుములు, మెరుపులు హడలెత్తించాయి. భారీ శబ్దాలతో ఉరుములు రావడంతో జనాలు హడలెత్తిపోయారు. ఇక పిడుగుపాటుకు 38 మంది మరణించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల కారణంగా గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నెమ్మది నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుని కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయ్యాయి.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అలాంటిది కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ జైల్లో మగ్గుతున్నాడు. గత కొద్ది రోజుల్లో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అయితే అతనికి జైలు ఆహారం పడటం లేదని వాపోయాడు.