బీహార్‌లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. రాష్ట్రంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి.. ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కానీ ఈ పరంపర మాత్రం ఆగడం లేదు. తాజా సంఘటనతో మూడు వారాల్లో 13వ వంతెన కూలిపోయింది. సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో తెల్లవారుజామున ఈ బ్రిడ్జి కూలిపోయింది. మూడు వారాల్లో రాష్ట్రంలో జరిగిన 13వ సంఘటనగా అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Vizag Steel Plant: విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి.. స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఉత్కంఠ..
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సహర్సా అదనపు కలెక్టర్ జ్యోతి కుమార్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం రావల్సి ఉందని పేర్కొన్నారు. వరుసగా వంతెనలు కూలడంతో బీహార్ ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని పాత వంతెనలపై సర్వే నిర్వహించి తక్షణ మరమ్మతులు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత వారం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: BMW hit and run case: యాక్సిడెంట్ తర్వాత 40 సార్లు లవర్‌కి ఫోన్.. మిహిర్ షాకి 7 రోజుల కస్టడీ..