మెట్రో స్టేషన్లు, రైళ్లు, విమానాలు గొడవలకు, కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆయా మెట్రో రైళ్లలో ఫైటింగ్‌లు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో టోకెన్ల దగ్గర క్యూలో నిలబడిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Viral news: 500 ఏళ్ల నాటి “ఏనుగు పాదం”గా పిచితే చింత చెట్టు..ఎక్కడ ఉందో తెలుసా?
టోకెన్ల కోసం క్యూలో నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం తర్వాత ఒకరినొకరు కొట్టుకున్నారు. వరుసలో నిలబడి ఉన్న మరొక వ్యక్తి వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అందులో ఒకరు.. అతనిని చెంపదెబ్బ కొట్టాడు. అనంతరం ఆ ఇద్దరూ అతనిని గొడవలోకి లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెట్రో అధికారులు.. స్టేషన్లలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’
Kalesh b/w two uncles inside Delhi metro over buying coins
pic.twitter.com/0Zcy8dvrDs— Ghar Ke Kalesh (@gharkekalesh) July 10, 2024