భారతీయ కుర్రాడు తన టాలెంట్‌తో అమెరికా న్యాయనిర్ణేతలను ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏమి ప్రతిభ.. డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లతో ఉత్సాహపరిచారు. దీంతో ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
భారత్‌లోని రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ అమెరికాలో జరుగుతున్న గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గ్రావిటీ డిఫైయింగ్ డ్యాన్స్ చేశాడు. తలపై టీ గాజు గ్లాసులపైన కుండ పెట్టుకుని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశాడు. ఏ మాత్రం తొణకకుండా.. డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. దీంతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో అలానే చూశారు. చివరికి ప్రవీణ్ డ్యాన్స్ పూర్తి చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాస్ గాట్ టాలెంట్ న్యాయమూర్తులైతే మంత్రముగ్ధులైపోయారు.
10 సంవత్సరాల వయసు నుంచి తన తండ్రి దగ్గర శిక్షణ పొందినట్లు ప్రవీణ్ తెలిపాడు. గత దశాబ్ద కాలంగా రోజూ 2-3 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. గతంలో రాజస్థానీ భావాయి జానపద నృత్యంతో ఇండియాస్ గాట్ టాలెంట్‌పై కూడా ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడు కూడా న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రవీణ్ కళ, అతని నృత్యం చూసి కిరణ్ ఖేర్, శిల్పాశెట్టి కుంద్రా, బాద్షా, మనోజ్ మునాషీర్‌లతో సహా న్యాయనిర్ణేతలందరూ చాలా ముగ్ధులయ్యారు. తాజాగా మరోసారి మంగళవారం అమెరికాలో జరిగిన టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి తన ప్రతిభను చాటిచెప్పాడు. ఇండియా పేరు మార్మోగేలా చేశాడు. ప్రవీణ్ డ్యాన్స్‌కి అమెరికా న్యాయనిర్ణేతలందరూ, ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ డ్యాన్స్ ఏదో మీరు కూడా ఒకసారి చూసేసి.. ఆనందించండి.