ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. శుక్రవారం(జూలై 12న) కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి.. కలెక్టర్లకు సీఎం సూచన
స్వాతి మలివాల్‌పై మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగింది. బిభవ్ కుమార్.. ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. కొట్టొద్దని ప్రాధేయపడినా ఏ మాత్రం కనికరించకుండా ఇష్టానుసారంగా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్‌పై ఇంటికొచ్చారు. ఆ సమయంలో మే 13న కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మలివాల్ వచ్చారు. అక్కడే బిభవ్ కుమార్.. ఎంపీపై భౌతికదాడికి తెగబడ్డారు.
#WATCH | AAP MP Swati Maliwal after Bibhav Kumar's bail hearing in Delhi High Court in alleged assault case
Delhi High Court today reserved order on bail plea moved by Bibhav Kumar, former personal secretary to Delhi Chief Minister Arvind Kejriwal in Swati Maliwal alleged… pic.twitter.com/YIA2QHNd0x
— ANI (@ANI) July 10, 2024