Delhi: గ్రాడ్యుయేట్ తండ్రి ఘాతుకం.. ఒకేసారి కవల ఆడపిల్లలు పుట్టారని హత్య
- ఢిల్లీలో గ్రాడ్యుయేట్ తండ్రి ఘాతుకం
- ఒకేసారి కవల ఆడపిల్లలు పుట్టారని హత్య
- నిందితుడు నీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
Also Read
నీరజ్ సోలంకి(32).. ఓటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఉంటాడు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. అతడు భార్య హర్యానాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. అయితే నీరజ్‌కి ఆడ పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. కుమారుడు కావాలని ఆశ పడ్డాడు. అయితే బాలింత ఆస్పత్రిలో ఉండగా.. శిశువులను ఢిల్లీకి తీసుకొచ్చి.. జూన్ 3న చంపేసి ఇంటి సమీపంలో పాతిపెట్టాడు. పిల్లలు అనారోగ్యంతో చనిపోయారని భార్యకు అబద్ధం చెప్పాడు. పిల్లలు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఇది కూడా చదవండి: Fire Accident: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు అనుమతితో జూన్ 5న మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మంగోల్‌పురిలోని ఎస్‌జీఎం ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు డీసీపీ గోయెల్ తెలిపారు. కొడుకు పుట్టలేదని.. ఆడ శిశువులను చంపినట్లు వెల్లడించారు. నిందితుడు నీరజ్ సోలంకిని హర్యానాలోని రోహ్‌తక్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. పూత్ కలాన్ గ్రామ సమీపంలోని తాత్కాలిక శ్మశానవాటిక ఆవరణలో శిశువుల మృతదేహాలను స్థానికులు కనుగొన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అమిత్ గోయెల్ స్పష్టం చేశారు. అనారోగ్యంతో చనిపోయారని భార్యకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి సజీవంగా తీసుకొచ్చి చంపేసినట్లు పోలీస్ అధికారి వివరించారు. సోలంకి సోదరి, సోదరుడు పరారీలో ఉన్నారని.. అతని తల్లి పక్షవాతానికి గురైందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను కూడా విచారించే అవకాశం ఉందని మరో పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Russia: భారతీయులను మా ఆర్మీలో ఎన్నడూ కోరుకోలేదు..
సోలంకి, అతని కుటుంబం సభ్యులంతా రాత్రంతా శిశువులకు ఆహారం ఇవ్వకపోవడం వల్లే వారు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువులపై శవపరీక్షలో ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేకపోయారు. అయితే తదుపరి విచారణ కోసం అంతర్గత అవయవాలు భద్రపరిచారు. రోహ్‌తక్‌కు చెందిన శిశువు తల్లి.. సోలంకిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 2022లో అత్తమామలతో ఆమె సంబంధం చెడిపోయింది. వరకట్నం కోసం క్రమం తప్పకుండా వేధించేవారని బాధితురాలు పోలీసులు తెలిపింది. సోలంకి, కుటుంబ సభ్యులు తనను లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని కోరారని, అందుకు నిరాకరించినట్లు పోలీసులకు తెలిపింది. పోస్టుమార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను తల్లికి అప్పగించారు. సోలంకిపై హత్యానేరం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!