Bilkis Bano Case: గుజరాత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- బిల్కిస్ బానో కేసులో గుజరాత్ సర్కార్‌కు చుక్కెదురు
- రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దోషుల విడుదలకు సంబంధించిన తమ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లైంది.
2002 గుజరాత్ గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపినందుకు దోషులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. ఆ ఘటనపై గత జనవరిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషుల శిక్షాకాలం ముగియకముందే ‘సత్ప్రవర్తన’ కారణంగా విడుదల చేయడంపై మండిపడింది. దోషులందరూ వెంటనే జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని తెలిపింది. గుజరాత్ సర్కార్ దోషులతో కుమ్మకైందని.. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధర్మాసనం మండిపడింది.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇది కూడా చదవండి: Devara : మాస్ జాతర మొదలైపోయింది!
తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని గుజరాత్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం వ్యాఖ్యలు సరికాదని, కేసు రికార్డుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై పక్షపాతంతో వ్యవహరించారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ధర్మాసనం.. గురువారం పిటిషన్‌ను కొట్టివేసింది.
2002లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది కూడా చదవండి: Amit Shah: ఆయుధాలు వదలి చర్చలకు రండి, లేదంటే చస్తారు.. ఉగ్రవాదులకు అమిత్ షా పిలుపు..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!