Jharkhand: సీఎం హేమంత్‌ను పోలిన వ్యక్తి ఫొటో వైరల్.. అతనెవరంటే..!
- సీఎం హేమంత్‌ను పోలిన వ్యక్తి ఫొటో వైరల్
- ఎక్స్‌లో పంచుకున్న ముఖ్యమంత్రి హేమంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమ్మీద మనుషుని పోలిన మనుషులు అక్కడక్కడా ఉంటారంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. జార్ఖండ్‌లో మాత్రం ఒక ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సహజంగా కవల పిల్లలు ఒకేలా.. అచ్చు గుద్దినట్లుగా ఉంటారు. అలా కాకుండా ఒక వ్యక్తిని పోలిన వ్యక్తి ప్రత్యక్షమైతే ఆశ్చర్యంగా ఉండదా?. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు వారిద్దరు ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహ్రా కలిశారు. హేమంత్ నివాసంలో మధ్యాహ్నం కలిశారు. అనంతరం వారిద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలను ముఖ్యమంత్రి హేమంత్ తన అధికారిక ఎక్స్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాని కింద ‘మరో హేమంత్’ అంటూ క్యాప్షన్ రాశారు. అంతే ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం హేమంత్‌ను పోలిన ఆ వ్యక్తి ఎవరంటూ చర్చించుకుంటున్నారు.

రాంచీలోని హతియా ప్రాంతానికి చెందిన మున్నా లోహ్రా తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి హేమంత్‌ను కలిశారు. రంగస్థల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం మున్నా లోహ్రా మీడియాతో మాట్లాడారు. తాను సీఎం హేమంత్‌ను పోలి ఉండడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రికి వీరాభిమానినని, ఆయనను ఆదర్శంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రంగస్థల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. కళాకారులకు మెరుగైన విధానాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హేమంత్ హామీ ఇచ్చారని వివరించారు.
‘‘థియేటర్ ఆర్టిస్టుల సమస్యలను దగ్గరి నుంచి చూశాను. వారి సమస్యలు తెలుసుకుంటున్నాను.. రాబోయే రోజుల్లో వారికి మెరుగైన ఫలితాలు అందించేందుకు కృషి చేస్తాను. జార్ఖండ్‌లోని కళాకారులు, క్రీడాకారులు ఎంతో ప్రతిభావంతులు.. రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో గర్వించేలా చేశారు. థియేటర్ ఆర్టిస్టులు గౌరవంగా జీవించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తాం’’ అని ముఖ్యమంత్రి హేమంత్ చెప్పారు. ఇదిలా ఉంటే త్వరలోనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కళాకారుల సమస్యలు ప్రస్తావనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే హేమంత్-మున్నా లోహ్రా ఒకేలా ఉండడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఫొటోలు వైరల్‌గా మారాయి. హేమంత్ కంటే కొంచెం పొట్టిగా ఉన్నాడు. ఇద్దరూ భుజంపై చేయి వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు.
एक हेमन्त की दूसरे हेमन्त से मुलाक़ात।
रंगमंच के सधे हुए कलाकार श्री मुन्ना लोहरा एवं उनके परिवार से मुलाकात एवं लंबी बातचीत हुई। pic.twitter.com/EsX9kilQux
— Hemant Soren (@HemantSorenJMM) September 25, 2024
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!