Israel video released: వామ్మో.. ఈ వీడియో చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో..!
- లెబనాన్‌పై దాడి వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
- వీడియో చూడాలని హెజ్బుల్లా కోరుకోదు అంటూ క్యాప్షన్
- వీడియో చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది అక్టోబర్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టింది. చివరికి అదే నెల వచ్చేటప్పటికీ ఇప్పుడు గురి హిజ్బుల్లా మీదకు మళ్లింది. గత వారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసింది. పేజర్లు, వాకీటాకీలను పేల్చి వందలాది మంది ప్రాణాలు తీసింది. ఇక ఈ వారం ప్రారంభంలోనే సోమవారం 600 రాకెట్లు ప్రయోగించింది. దాదాపు 557 మంది చనిపోయారు. ఇంకా దాడులు కొనసాగిస్తోంది. ఇక తాజాగా దాడులను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో అన్నట్టుగా ఉంది. లెబనాన్‌పై చేస్తున్న దాడుల తీరును వివరిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్ (IDF) ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. యుద్ధ విమానాలతో స్థావరాలను ధ్వంసం చేస్తున్న తీరు కనిపించింది. ‘‘ మీరు ఈ వీడియో చూడాలని గానీ, షేర్ చేయాలని గానీ హెజ్బుల్లా కోరుకోదు’’ అని క్యాప్షన్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Israel-Lebanon: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విధ్వంసం.. కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ హతం..!
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రాకెట్ దాడులు చేస్తోంది. హిజ్బుల్లా నేతలు.. పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. నివాస సముదాయాల్లో భారీగా ఆయుధాలు దాచిపెట్టినట్లుగా ఆరోపిస్తోంది. దక్షిణ లెబనాన్ అడ్డగా హిజ్బుల్లా కార్యకలాపాలను విస్తరించినట్లుగా కనిపెట్టింది. అందుకే హిజ్బుల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది.
https://twitter.com/IDF/status/1839251492655571063
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!