ఫ్రాన్స్‌లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఫ్రెంచ్ వైమానికి దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు కిందపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం నిర్ధారించింది. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అతని ఆచూకీ తెలిపింది. ఇక వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నారు.
గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబావుటా ఎగరేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘హమాస్ అవుట్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే యుద్ధం ముగించాలని.. హమాస్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు పాకింది. కునాల్ కమ్రాకు సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ టాయిలెట్ వెలుపల ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే.. ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తామంటూ యువసేన అధ్యక్షుడు అనురాగ్ సోనార్ హెచ్చరించారు. శివసేన యువజన విభాగం కార్యకర్తలు.. కునాల్ కమ్రాను హెచ్చరిస్తూ నగరంలో పోస్టర్లు వేశారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో వర్మను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని అలహాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తున్నట్లు రేఖా గుప్తా తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన పథకం కోసం మొత్తం రూ.5,100 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధానిలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 సాయం అందిస్తామని పేర్కొన్నారు.
దక్షిణాదిలో డీలిమిటేషన్ వ్యవహారం కాకరేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటానికి దిగారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో డీఎంకే సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఇటీవల చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది.
నేహా కక్కర్... బాలీవుడ్ సింగర్. ప్రముఖ గాయకులు టోనీ కక్కర్, సోను కక్కర్ల చెల్లెలు. నేహా కక్కర్ చిన్న వయసులోనే మతపరమైన కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ పాపులారిటీ సంపాదించింది. ఇక నేహా ‘మీరాబాయి నాటౌట్’ సినిమాతో నేపథ్య గాయనిగా హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం ‘‘ఇండియన్ ఐడల్’’ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఒక గుర్తింపు సింగర్‌గా కొనసాగుతోంది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్‌లో పర్యటిస్తున్నారు. అధికారుల బృందంతో కలిసి బ్రిటన్‌లో పర్యటన కొనసాగుతోంది. యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి ఆదివారం మమత లండన్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా ఆమె లండన్ అందాలను వీక్షించారు.