మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
ఇది కూడా చదవండి: PK : షిహాన్ హుస్సైనీ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
తాజాగా ఇదే అంశంపై షిండే తొలిసారి స్పందించారు. బీబీసీ మరాఠీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడారు. తనను ‘ద్రోహి’ అని సంభోదించాడంటే కచ్చితంగా ప్రత్యర్థుల దగ్గర సుపారీ తీసుకునే మాట్లాడినట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమే.. కానీ ఒకరి ఆదేశం మేరకు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. అయితే కార్యకర్తలు చేసిన విధ్వంసాన్ని సమర్థించనన్నారు. ఈ సందర్భంగా న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తుచేశారు. ‘‘చర్యకు.. ప్రతిచర్య’’ అనేది ఉంటుందని షిండే వ్యాఖ్యానించారు. ఇక ‘‘నా గురించి మరిపోండి.. కునాల్ అనే వ్యక్తి.. ప్రధానమంత్రి మోడీ గురించి.. మాజీ ప్రధాన న్యాయమూర్తి గురించి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురించి? హోంమంత్రి అమిత్ షా గురించి.. పారిశ్రామిక వేత్తల గురించి ఏమన్నాడో తెలిసిందే కదా?.’’ అని పాత విషయాలను షిండే గుర్తుచేశారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది. వ్యంగ్యాన్ని కూడా అర్థం చేసుకుంటాం. కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఎవరి గురించైనా వ్యతిరేకంగా మాట్లాడటానికి కాంట్రాక్ట్ తీసుకుని ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: స్ట్రాటజీ మారుస్తున్న వైఎస్ జగన్..! త్వరలోనే కీలక మార్పులు..!
ఒక హిందీ పాటను కునాల్ కమ్రా.. షిండే రాజకీయ జీవితాన్ని పేరడీ చేసి పాడారు. శివసేన పార్టీని చీల్చేసిన ‘ద్రోహి’ అంటూ షిండేను ఉద్దేశించి కునాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. షిండే మద్దతుదారులు.. క్లబ్, స్టూడియోపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. అనంతరం కునాల్‌పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారు. తాజాగా కునాల్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. తమ ఎదుట హాజరుకావాలని కోరారు.
ఇదిలా ఉంటే కునాల్‌ను ముంబై పోలీసులు ఫోన్‌లో సంప్రదించగా.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతాన్నారు. ఇక సుపారీ ఇచ్చి మాట్లాడించారంటూ వస్తున్న వార్తలను కునాల్ ఖండించారు.