దక్షిణాదిలో డీలిమిటేషన్ వ్యవహారం కాకరేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటానికి దిగారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో డీఎంకే సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఇటీవల చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరై తమ గళాన్ని తెలియజేశారు. డీలిమిటేషన్‌తో ఏర్పడే విపత్తును గురించి ప్రస్తావించారు. తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Feet Healthcare : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త !
ఇదిలా ఉంటే డీలిమిటేషన్‌పై ఉద్యమం ఉధృతం అవుతున్న వేళ బీజేపీ అధిష్టానం అప్రమత్తం అయింది. తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాని కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళినిస్వామికి కబురు పంపింది. దీంతో ఆయన ఎమర్జెన్సీగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలను కలిసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే ఛాన్సుందని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి బీజేపీ-ఏఐడీఎంకే పొత్తు ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఏఐడీఎంకే పార్టీ ఆఫీసును ఈపీఎస్ ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కలెక్టర్లుకు సీఎం స్వీట్ వార్నింగ్..