నేహా కక్కర్… బాలీవుడ్ సింగర్. ప్రముఖ గాయకులు టోనీ కక్కర్, సోను కక్కర్‌ల చెల్లెలు. నేహా కక్కర్ చిన్న వయసులోనే మతపరమైన కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ పాపులారిటీ సంపాదించింది. ఇక నేహా ‘మీరాబాయి నాటౌట్’ సినిమాతో నేపథ్య గాయనిగా హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం ‘‘ఇండియన్ ఐడల్’’ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఒక గుర్తింపు సింగర్‌గా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Hyderabad: రోడ్డెక్కిన న్యాయవాదులు.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
అయితే ఇటీవల మెల్‌బోర్న్‌లో నేహా కక్కర్ కచేరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. స్టేడియం అంతా సందడి సందడిగా ఉంది. అయితే ఎంత ఎదురుచూసినా నేహా కార్యక్రమం ప్రారంభం కాలేదు. గంట.. రెండు.. మూడు గంటలైంది. అయినా కూడా కచేరీ ప్రారంభం కాలేదు. నేహా కోసం అభిమానులంతా అలా ఎదురుచూస్తూనే ఉన్నారు. చూసి.. చూసి ఒకింత ప్రేక్షకుల్లో కోపం చెలరేగింది. మొత్తానికి 3 గంటలు ఆలస్యంగా స్టేజ్‌పైకి వచ్చింది. దీన్ని గమనించిన నేహా.. స్టేజ్‌పైకి వచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. మూడు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు తనను క్షమించాలంటూ అభ్యర్థించింది. ఇంత ఆలస్యంగా వచ్చినా.. తన కోసం ఇంత ఓపికగా వేచి ఉన్న ప్రేక్షకులందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ శిరసు వంచి అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ఇది కూడా చదవండి: Kollywood : హిట్ కాంబో సినిమాకు ఆర్థిక కష్టాలు..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై విభిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. అప్పటికే ఆమెపై కొందరు కోపంగా ఉన్నారు. ఇంకొందరైతే వాపస్ జావో అంటూ నినాదాలు చేశారు. ఇది భారతదేశం కాదు.. ఆస్ట్రేలియా.. తిరిగి హోటల్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకో.. చాలా బాగుంది మీ నటన అంటూ ఇలా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఆమె మీ అందరితో డ్యాన్స్ చేయించేలా చూస్తానంటూ వ్యాఖ్యానించింది. నేహా కక్కర్ భావోద్వేగ సన్నివేశాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే మెల్‌బోర్న్‌కు ముందు సిడ్నీలో నేహా ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
Neha Kakkar crying for being 3 hrs late at a Melbourne show
She also performed for less than 1 hour #NehaKakkar pic.twitter.com/TGyhaeCjpu— Redditbollywood (@redditbollywood) March 24, 2025