పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గత కొద్దిరోజులుగా హడలెత్తించిన బంగారం ధరలు.. గత వారం నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కూడా మరోసారి భారీగా ధరలు తగ్గాయి. ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి సౌరబ్‌ను భార్య హత్య చేయగా.. తాజాగా ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను చంపింది ఓ నవ వధువు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
చెన్నైలో యూట్యూబర్ సవుక్కు శంకర్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మానవ మలాన్ని ఇంటి ముందు పారబోసి.. అతడి తల్లిని బెదిరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇక కునాల్ కమ్రా ఉపయోగించిన క్లబ్, స్టూడియోను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం శివసేన శ్రేణులు.. కునాల్ కమ్రాపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక పోలీసులు.. కునాల్ కమ్రా, శివసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. అయితే భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రివర్టన్ తీరంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం… ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 నుంచి 6.8 మధ్య ఉన్నట్లుగా పేర్కొంది. భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో […]
భార్యాభర్తల సంబంధాలు రోజు రోజుకు దెబ్బతింటున్నాయి. కట్టుకున్నవాళ్లే కసాయిలుగా మారుతున్నారు. బంధాలను మరిచి కాటికి పంపిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్‌ను భార్య, ఆమె ప్రియుడి చంపిన ఘటనను ఇంకా మరువక ముందే బెంగళూరులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి కట్టుకున్నవాడినే కాటికి పంపించింది ఓ ఇల్లాలు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు... ముంబైలోని స్టూడియో, క్లబ్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కునాల్‌పై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కునాల్ కమ్రాతో సహా దాడికి పాల్పడ్డ శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎలోన్ మస్క్‌కు సంబంధించిన న్యూరాలింక్ పరికరం సత్ఫలితాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. పక్షవాతానికి గురైన ఎనిమిది సంవత్సరాల తర్వాత 2024, జనవరిలో 30 ఏళ్ల నోలాండ్ అర్బాగ్‌కు యూఎస్ న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్ పరికరాన్ని మొదడులో అమర్చారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. ఇక శివసేన కార్యకర్తలు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.