France: వైమానిక విన్యాసాల్లో అపశృతి.. 2 విమానాలు ఢీ.. ముగ్గురికి సీరియస్
- వైమానిక విన్యాసాల్లో అపశృతి
- 2 విమానాలు ఢీ.. ముగ్గురికి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్‌లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఫ్రెంచ్ వైమానికి దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు కిందపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: NTR : జపాన్‌లో భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎన్టీఆర్
Also Read
వైమానిక స్థావరం సమీపంలో ఆల్ఫా జెట్ విమానాలు ఢీకొన్నాయని ఫ్రెంచ్ వైమానిక మరియు అంతరిక్ష దళం తెలిపింది. ఒక విమానం సైలోను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని తెలిపింది. ఇద్దరు పైలట్లు, ఒక ప్రయాణికుడు విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని.. వారంతా స్పృహలోనే ఉన్నారని తెలిపింది. ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలు అయినట్లుగా పేర్కొంది. పౌరులకు మాత్రం ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: Gaza: హమాస్‌పై ప్రజలు తిరుగుబాటు.. ‘హమాస్ అవుట్’ అంటూ నిరసన ర్యాలీలు
ఆరు విమానాలు వేర్వేరు రంగులతో డ్రైవ్ చేస్తున్నాయి. నాలుగు విమానాలు ఒకే పథంలో వెళ్తుండగా.. ఎడమ వైపున ఉన్న రెండు విమానాలు మాత్రం ఢీకొని కిందకు దూసుకొచ్చాయి. ప్రమాదం జరగగానే మంటలు చెలరేగి.. పొగలు ఎగిసిపడ్డాయి. రిహార్సల్స్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. ఉక్రెయిన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ తేలికపాటి ఆల్ఫా ట్విన్-ఇంజన్ విమానాలు ఉపయోగిస్తుంది. గతేడాది ఆగస్టులో తూర్పు ఫ్రాన్స్‌లో రెండు ఫ్రెంచ్ రాఫెల్ జెట్‌లు గాల్లో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. రాఫెల్ యుద్ధ విమానాలను భారత్, ఈజిప్ట్, గ్రీస్, ఇండోనేషియా, క్రొయేషియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఫ్రాన్స్ విక్రయించింది.
Watch MOMENT French jets collide during training session
Pilots and passenger ‘found unconscious’ pic.twitter.com/SR49r6ymUX
— RT (@RT_com) March 25, 2025
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!