భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌కు బీహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామంలో దుర్గా ఆలయాన్ని కన్హయ్య కుమార్ సందర్శించారు. ‘పలయన్ రోకో, నౌక్రీ దో’ పాదయాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు.
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కునాల్ కమ్రా పిటిషన్ వేశారు.
ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరలా వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. గత 5-6 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.440 పెరగగా.. నేడు రూ.1,140 పెరిగింది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే క్రమశిక్షణ తప్పుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. బ్రిటన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి మమత యూకేలో పర్యటిస్తున్నారు. అయితే గురువారం లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగ్ కళాశాలలో మమత ప్రసంగించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ట్రంప్ విందు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓట్లు వేసినందుకు ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
యెమెన్ నుంచి ఇరాన్ మద్దతుగల హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ విమానాశ్రయం, సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. అమెరికా యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు తెగబడ్డారు. అయితే క్షిపణి దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంది. క్షిపణులను గాల్లో పేల్చేసింది.