అమెరికాతో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాపై అమెరికా అధిక సుంకాలను విధించిన నేపథ్యంలో కార్నీ ఈ విధంగా స్పందించారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు.
యునైటెడ్ కింగ్డమ్ రాజు చార్లెస్ (76) ఆస్పత్రిలో చేరారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. కేన్సర్ చికిత్స కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిలో చేరినట్లుగా పేర్కొంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో గరం గరం అయ్యారు. బుధవారం సభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తుండగా స్పీకర్ ఓం బిర్లా పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడుతుండగానే సభను స్పీకర్ వాయిదా వేసేశారు. దీంతో స్పీకర్ తీరును రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు.
దక్షిణ కొరియాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానల కారణంగా చెలరేగిన కార్చిచ్చులు కారణంగా 18 మంది చనిపోయారు. 19 మంది గాయపడ్డారు. ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు.
గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది.
మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, పైజామాను విరగ్గొట్టడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా మాజీ ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. సంజయ్ మిశ్రా ఈఏసీ-పీఎంలో పూర్తి సభ్యుడిగా ఉండనున్నారు. సంజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణుడు. అనేక ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈడీ చీఫ్‌గా ఆయన పదవీకాలం నవంబర్ 18, 2023 వరకు రెండుసార్లు పొడిగించబడింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఎన్కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాఫర్ గులాం హుస్సేన్ హతమయ్యాడు. మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్టులో గులాం హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా నగలు దాచిన చోటు చూపిస్తానంటూ పోలీసులను జాఫర్ బయటకు తీసుకెళ్లాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇకపై ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. అంతేకాకుండా అమెరికాయేతర పౌరులు విరాళం ఇవ్వకుండా నిషేధం విధించింది.