వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన సమావేశం అయినట్టు సమాచారం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు..
సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా..?ను అంటూ ఎదురు ప్రశ్నించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారు.. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని, అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కాకినాడ పర్యటన పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాకినాడ సిటీ నియోజక వర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని.. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల సమీక్ష చేపట్టిన ఆయన కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కేషన్న, పలువురు సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీలు సమావేశం అయ్యారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికే ఈసారి కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తాం.. వేరేవాళ్లకు టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎమ్మిగనూరు ఎంపీపీ కేషన్న.