APPSC: రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. గత నెలలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. ఈ ఏడాది మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు.. ఇక, ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం.. గ్రూప్-1 పోస్టులకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు.. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా, గ్రూప్-1 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది.
Read Also: YS Sharmila: పార్టీని బతికించటం కాదు.. అధికారంలోకి తీసుకొద్దాం..
గ్రూప్-1 కు ప్రిపేరై సమయంలోపు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోయినవారికి ఏపీపీఎస్సీ ఊరట కలిగించే న్యూస్ చెప్పింది.. గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంచింది.. ఈ నెల 21వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసిపోగా.. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ .. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ నిర్ణయం తీసుకుంది.. కాగా, మార్చి నెల 17వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు.. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డీఎస్పీ (సివిల్) 26, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6, కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనుంది ఏపీపీఎస్సీ.