రెండో జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది.. అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు
మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందంటూ ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. దీనిపై పలు సందర్భంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.. అయితే, డీఎస్సీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని స్పష్టం చేశారు.. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారికి దిశానిర్దేశం చేశారు.. వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం.. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అన్నారు
రానున్న ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. మరోవైపు, పలువురు పార్టీ నియోజకవర్గ నేతలు తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా రాంబాబు
మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి కాల్ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్నికి కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.. పెనుకొండ బాధ్యతలు తీసుకోవాలని అధిష్టానం నాకు సూచించిందన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు.